మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళన

మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళన

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎల్ఈడీ స్క్రీన్ ప్రమాదంలో గాయాల పాలైన విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే సీఐ సురేష్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకొని, నెట్టివేశారు. దీంతో సీఐ సురేష్ వైఖరికి నిరసనగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. హాస్పిటల్ లోకి వెళ్లడానికి టీఆర్ఎస్ నేతలకు ఉన్న పర్మిషన్ కాంగ్రెస్ నాయకులకు లేదా అని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసుసు అరెస్టు చేసిస వన్ టౌన్ స్టేషన్ కు తరలించారు.

ఇటీవల మిర్యాలగూడలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్  ప్రమాదవశాత్తు కిందపడి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో గాయాలైన విద్యార్థులను పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై 2022 సెప్టెంబర్ 17 నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌ సెంట్రల్‌ లాన్స్‌లో జరిగే తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.