గోవా నుంచి కర్ణాటకకు ప్రజలను ఎందుకు తరలిస్తున్నారు : కాంగ్రెస్ ప్రశ్న

గోవా నుంచి కర్ణాటకకు ప్రజలను ఎందుకు తరలిస్తున్నారు : కాంగ్రెస్ ప్రశ్న

కర్ణాటక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నడుస్తున్న వేళ అర్ధరాత్రి కాంగ్రెస్ చేసిన ట్విట్ రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ ట్విట్ లో ఉన్న వీడియోలో కొన్ని బస్సుల్లో ప్రజలు ఎక్కి వెళ్తున్న దృశ్యం కనిపిస్తోంది. 

కాంగ్రెస్ ఆరోపణలు..

కాంగ్రెస్ అఫిషియల్ ట్విటర్ హ్యాండిల్ రీట్వీట్  చేసిన ఈ వీడియో అనుమానాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ  ఆరోపించింది. బీజేపీ బస్సుల్లో అక్రమంగా డబ్బుల్ని పంపుతోందా లేక, బోగస్ ఓట్లు వేయించాలని చూస్తున్నారా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. కదంబ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లో ఉత్తర కర్ణాటకకే జనాన్ని ఎందుకు తరలిస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. 
ప్రధాని మోడీ ర్యాలీకి ముందు గోవా ప్రజలను కర్ణాటకకు తరలించారని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా అన్నారు.

 గోవా బీజేపీ మంత్రి విశ్వజీత్ రాణే  దాండేలిలోని విస్లింగ్ వుడ్జ్ జంగిల్ రిసార్ట్ లో 6 గదులు ఎందుకు బుక్ చేశారని కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా కర్ణాటక డీజీపీని ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేలా అధికారులు బీజేపీకి సహకరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కన్నడ రాష్ట్రంలో మే 10 ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు 11.50 శాతం ఓటింగ్ నమోదైంది.