ఇక్కడి రైతుల్ని వదిలేసి పంజాబ్​ రైతులకు సాయమేంది?

ఇక్కడి రైతుల్ని వదిలేసి పంజాబ్​ రైతులకు సాయమేంది?
  • సీఎం కేసీఆర్‌‌కు ఎంపీ ఉత్తమ్ ప్రశ్న


హైదరాబాద్ : రాష్ట్రంలో మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పరామర్శించని సీఎం కేసీఆర్‌‌.. ఢిల్లీ, పంజాబ్‌ రైతులకు పరిహారం ఇవ్వడానికి వెళ్లడమేంటని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌‌ రెడ్డి ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్ర రైతులకు ఇప్పటివరకు పరిహారం ఇవ్వడానికి కేసీఆర్‌‌కు మనసు రాలేదన్నారు. రైతు భరోసా యాత్రలో రెండో రోజు ఆదివారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి మిర్చి రైతులు భారీగా నష్టపోయారని, ఇప్పటివరకు వారిని పరామర్శించడానికి కనీసం ఒక మంత్రి, ఎమ్మెల్యే కూడా రాలేదని మండిపడ్డారు. 

రెండ్రోజుల్లో రెండు పార్టీలు మారిన ఎంపీటీసీ 
చింతలపాలెం మండలం కిష్టాపురానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ షేక్ షాహేదా బేగం, ఆమె భర్త జానీపాషా ఉత్తమ్‌ సమక్షంలో శనివారం కాంగ్రెస్​లో  చేరారు. తిరిగి ఆదివారం టీఆర్‌‌ఎస్‌లోకి వెళ్లారు. టీఆర్‌‌ఎస్‌ పార్టీలో పనులు కావడం లేదన్న అసంతృప్తితోనే కాంగ్రెస్‌లో చేరామని, స్థానిక నాయకుల ఒత్తిడితో మళ్లీ టీఆర్ఎస్‌లోకి వచ్చామన్నారు.

మరిన్ని వార్తల కోసం : -

సర్కారు సంస్థలే కరెంటు బిల్లులు కడ్తలే


భూములు అమ్మాలని సర్కార్ నిర్ణయం..టార్గెట్ 30 వేల కోట్లు