తుక్కుగూడ సభకు కాంగ్రెస్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 06వ తేదీ శనివారం జరిగే జనజాతర సభకు 10లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనజాతర సభకు AICC అధ్యక్షుడు ఖర్గేతో పాటు.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. తుక్కుగూడ సెంటిమెంట్ ను మరోసారి నమ్మింది కాంగ్రెస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే సభ నుంచి ఆరు గ్యారంటీలు ప్రకటించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో దేశ వ్యాప్తంగా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది.