జనవరిలో పీసీసీ మీటింగ్స్ వాయిదా వేసిన మహేశ్ కుమార్ గౌడ్

జనవరిలో పీసీసీ మీటింగ్స్ వాయిదా వేసిన మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: పీసీసీ విస్తృత స్థాయి సమావేశాలను కాంగ్రెస్‌‌ వాయిదా వేసింది. జనవరి మొదటి వారంలో నిర్వహిస్తామని వెల్లడించింది. తొలుత శనివారం గాంధీ భవన్‌‌లో సమవేశాలు నిర్వహిస్తామని పార్టీ ప్రకటించినా.. వివిధ కారణాలతో ఆది వారం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా టైమింగ్‌‌లో మార్పులు చేశారు. సాయంత్రం 4.30 గం టలకు ఉంటుందని మరో ప్రకటన చేశారు. 

అయితే, ఆదివారం కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం ఉండడంతో వీలుపడడం లేదని, అందుకే వాయిదా వేస్తున్నామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడిం చారు. కాగా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్​ని మార్చడమూ సమావేశాలు వాయిదా పడడానికి కారణంగా తెలుస్తు న్నది. మాణిక్ రావ్‌‌ ఠాక్రే స్థానంలో కొత్తగా దీపాదాస్ మున్షీని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్​గా హైకమాండ్ నియమించింది.