
- పాల్గొన్న టీపీసీసీ ప్రెసిడెంట్మహేశ్కుమార్గౌడ్, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షీనటరాజన్
వర్ధన్నపేట, వెలుగు: టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్, చేపట్టిన ప్రజా జనహిత పాదయాత్ర వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు సోమవారం రాత్రి చేరుకున్నది. కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ఇల్లంద నుంచి వర్ధన్నపేట వరకు పాదయాత్ర కొనసాగింది. అనంతరం నిర్వహించిన కార్నర్‌మీటింగ్‌లో వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ రాజ్యమని, పేదల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని అన్నారు. పదేండ్లు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క ఇల్లు, రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. యూరియా కొరత బీజేపీ ప్రభుత్వం సృష్టిస్తున్నదని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అనంతరం స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ రూ.200 కోట్లతో వర్ధన్నపేటకు ఇంటిగ్రేటెడ్స్కూల్ తీసుకొచ్చానని గుర్తుకు చేశారు. యూరియా కొరత ఉందని బీఆర్ఎస్ నాయకులు రైతులను ఉసి గొల్పుతున్నారని మండిపడ్డారు. యూరియా విషయంలో తమ తప్పు ఉందని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఒప్పుకున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలసిన బాధ్యత మనపై ఉందన్నారు.
కార్నర్ మీటింగ్ విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.