- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోటకొండూర్ మండల కేంద్రాల్లో మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసి మాట్లాడారు.
మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.60 చీరలు పంపిణీ చేసి మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చిందని మండిపడ్డారు. మహిళల ఆత్మగౌరవం రెట్టింపయ్యేలా ప్రజా ప్రభుత్వం నీలి రంగు చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మంగ సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్ తదితరులు ఉన్నారు.
చిట్యాల మండలం తాళ్ల వెల్లంలలో...
చిట్యాల : గ్రామాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, గ్రామ చెరువు వద్ద గంగమ్మ తల్లికి పూజలు చేశారు. చీరల పంపిణీ కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
సూర్యాపేట మండలం టేకుమట్లలో..
సూర్యాపేట : సూర్యాపేట మండలంలోని టేకుమట్లలో ఆదివారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు.
ఫ్రీ బస్సు, వడ్డీ లేని రుణాలు, సన్నబియ్యం, రేషన్‌కార్డుల వంటి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ప్రభుత్వానిదేనన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నాసిరకం చీరలు ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్లలో తయారైన నాణ్యమైన సిల్క్, కాటన్ చీరలను అందజేస్తుందన్నారు.
కార్యక్రమంలో వీబీకేలు డి. హేమలత, ఎన్. సరిత, మహిళ సంఘాల సభ్యులు సూరారపు మంజుల, చెరుమళ్ల పద్మ, సుంకరి నాగమ్మ, ఆలేటి సునీత, నిర్మల, దాసరి నరసయ్య, కాంపాటి రమేశ్, బసవరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
అనుముల మండలంలో..
హాలియా : నల్గొండ జిల్లా అనుముల మండలంలోని హజారిగూడెం, కొత్తపల్లి గ్రామాల్లో ఆదివారం కాంగ్రెస్ లీడర్లు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొత్తపల్లి సహకార సంఘం డైరెక్టర్ గుంటక ధనలక్ష్మి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు వద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కుంటి గొర్ల శ్రీనివాస్, నాయకులు బాసిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
రుమలగిరి మండల కేంద్రంలో..
తుంగతుర్తి : తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే మందుల సామెల్ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో హరిప్రసాద్, ఎంపీడీవో లాజర్ పాల్గొన్నారు.
