దళిత బంధు కోసం డప్పుల మోత

దళిత బంధు కోసం డప్పుల మోత

ముషీరాబాద్, వెలుగు: దళిత బంధు ప్రవేశపెట్టి 100 రోజులవుతున్నా కేసీఆర్ సర్కార్ నిధులు కేటాయించకుండా దళితులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఏఐసీసీ మెంబర్ బక్క జడ్సన్ మండిపడ్డారు. పథకం అమలులో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. దళిత బంధు ప్రకటించి  100 రోజులైన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ ప్రభుత్వానికి నిరసనగా 100 చావు డప్పుల దండోరా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సర్కార్ 2014 నుంచి ఏటా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను విడుదల చేయకుండా, రూ.80 వేల కోట్లను కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించిందని.. అందులో కోట్లాది రూపాయలు కల్వకుంట్ల ఇంట్లోకి వెళ్లాయని జడ్సన్ ఆరోపించారు. దళిత బంధు పేరుతో దళితులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దళిత సీఎం, మూడెకరాల భూమి, దళిత బంధు.. ఇలా ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా కేసీఆర్ దళిత వ్యతిరేకిగా మారారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగం ద్వారానే సీఎం పదవి చేపట్టి, రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.