‘సర్‌‌‌‌’కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీల నిరసన .. ఖర్గే, ప్రియాంకతో పాటు తెలంగాణ ఎంపీలు హాజరు

‘సర్‌‌‌‌’కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీల నిరసన .. ఖర్గే, ప్రియాంకతో పాటు తెలంగాణ ఎంపీలు హాజరు

న్యూఢిల్లీ, వెలుగు: ఆప‌‌రేష‌‌న్ సిందూర్‌‌, ప‌‌హ‌‌ల్గాం ఉగ్రదాడితో పాటు బిహార్‌‌‌‌లో ఓట్ల సవరణకు సంబంధించి స్పెషల్ ఇన్‌‌టెన్సివ్ రివిజన్(సర్) ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో శుక్ర వారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్‌‌లోని ‘మకర ద్వార్’ముందు నిర‌‌స‌‌న వ్యక్తం చేశారు. 

‘సర్’.. ఓట్ బ్యాండ్‌‌పై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వ్యతి రేకంగా బ్యాన‌‌ర్లు, ఫ్లకార్డుల ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో ఏఐసీసీ చీఫ్‌‌ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ ఎంపీలు మ‌‌ల్లు ర‌‌వి, చామ‌‌ల కిర‌‌ణ్‌‌ కుమార్‌‌ రెడ్డి, గ‌‌డ్డం వంశీ కృష్ణ, రామ స‌‌హాయం ర‌‌ఘురాంరెడ్డి, కడియం కావ్య నిరసన తెలిపారు. బిహార్‌‌‌‌లో ఎన్నికల సంఘం చేపడుతున్న సర్.. కేంద్ర ప్రభుత్వ ఆలోచన అని వారు విమర్శించారు.