జయంశంకర్ సొంతూరులో రేవంత్ రెడ్డి రైతు రచ్చబండ

జయంశంకర్ సొంతూరులో రేవంత్ రెడ్డి రైతు రచ్చబండ

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రైతు రచ్చబండ నిర్వహిస్తోంది. వరంగల్ రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీపీసీసీ రైతు రచ్చబండ చేపట్టింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ సొంతూరైన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో చేపట్టే రైతు రచ్చబండను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కంపేటకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కంపేటకు చేరుకొని రైతు రచ్చబండలో పాల్గొంటారు రేవంత్. రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని టీపీసీసీ మే 21 నుండి నెలరోజుల పాటు రైతు రచ్చబండ నిర్వహిస్తోంది. కాగా రాష్ట్రంలోని 1200కు పైగా గ్రామాల్లో రచ్చబండ చేపట్టేందుకు టీపీసీసీ ప్రణాళిక రచించింది.

మరిన్ని వార్తల కోసం

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ మాస్ లుక్

ప్రాంతీయం కాదు ప్రపంచ సినిమానే చూపెడుతోన్న ఓటీటీ