యూత్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన కాంగ్రెస్

యూత్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన కాంగ్రెస్

ఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం రాజకీయ పార్టీలన్నీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఓటర్లకు గాలమేసేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా యువతను తమవైపు తిప్పుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ యువత కోసం ప్రత్యేకంగా యూత్ మేనిఫెస్టో రూపొందించింది.ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఈ విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేశారు. నిరుద్యోగం సహా యువత ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. 

యూపీ యువత తరఫున నిలబడాలని కాంగ్రెస్ నిర్ణయించిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయపార్టీలు 25 - 30లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతారే తప్ప వాటిని ఎలా సృష్టిస్తారన్న విషయాన్ని వివరించవని ఆమె మండిపడ్డారు. యూత్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిందని అన్నారు. పరీక్షల సమయంలో యువత ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపడంపైనా దృష్టి సారించిమని చెప్పారు. యూపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ అమలు చేయడంతో పాటు ఏటా యూత్ ఫెస్టివల్స్ నిర్వహిస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తల కోసం..

కేరళలో విజృంభిస్తున్న కరోనా

మాస్క్ వాడకంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు