మాస్క్ వాడకంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

మాస్క్ వాడకంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, 18ఏళ్లలోపు వారికి సంబంధించి కేంద్రం సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఐదేళ్లలోపు పిల్లలకు మాస్క్ అవసరంలేదని స్పష్టం చేసింది. 6 నుంచి 11 ఏళ్ల వయసు వారికి తల్లిదండ్రుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉపయోగించే మాస్కులు వాడాలని సూచించింది. 12 ఏళ్లు దాటిన వారికి మాస్క్ కచ్చితమని చెప్పింది. మరోవైపు 18ఏళ్ల లోపు వారికి అందించే చికిత్సకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు ప్రతిపాదించింది. వారికి ఇన్ఫెక్షన్ తీవ్రత ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ యాంటీ వైరల్ లేదా మోనోక్లోనల్ యాంటీబాడీలు ఉపయోగించవద్దని ఆదేశించింది. ఒకవేళ స్టెరాయిడ్లు వాడితే వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వాటిని 10 నుంచి 14 రోజులకు తగ్గించాలని స్ఫష్టం చేసింది. కరోనా లక్షణాలు కనిపించిన 3 నుంచి 5 రోజుల పాటు స్టెరాయిడ్లను వినియోగించకూడదని తేల్చిచెప్పింది.

 మరిన్ని వార్తల కోసం..

ప్యాసెంజర్ మాస్క్ పెట్టుకోలేదని ఫ్లైట్ నే వెనక్కి మళ్లించారు

సోమ్నాథ్ ఆలయంలో కొత్త సర్క్యూట్ హోమ్స్