కేరళలో విజృంభిస్తున్న కరోనా

కేరళలో విజృంభిస్తున్న కరోనా

కేరళలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజుకో రికార్డు సృష్టిస్తోంది. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. ఇక రోజువారీ కేసుల సంఖ్య విషయానికొస్తే 19 రెట్లు పెరిగిందని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1న 18,904 యాక్టివ్ కేసులు ఉండగా.. గత మూడు వారాల్లో ఆ సంఖ్య 1.99లక్షలకు చేరింది. ఈ నెల ప్రారంభంలో 2,500 రోజువారీ కేసుల నమోదవుతుండగా.. జనవరి 20 నాటికి ఆ సంఖ్య 46,387కు చేరింది. కరోనా ప్రారంభమైన నాటి నుంచి ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం కేరళలో పాజిటివిటీ రేటు 40.2శాతంగా ఉంది. రాష్ట్రంలో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ 100శాతం పూర్తికాగా.. 83శాతం మంది సెకండ్ డోస్ టీకా తీసుకున్నారు. 15 నుంచి 18ఏళ్లలోపువారిలో 60శాతం మందికి ఫస్ట్ డోస్ టీకా ఇచ్చారు.

ప్రపంచాన్ని చుట్టొచ్చిన అతి చిన్న పైలట్

ప్యాసెంజర్ మాస్క్ పెట్టుకోలేదని ఫ్లైట్ నే వెనక్కి మళ్లించారు