ప్రపంచాన్ని చుట్టొచ్చిన అతి చిన్న పైలట్

ప్రపంచాన్ని చుట్టొచ్చిన అతి చిన్న పైలట్

ప్రపంచాన్ని చుట్టిరావడం ఆశామాషి విషయం కాదు. అటువంటిది ఒక 19 ఏళ్ల అమ్మాయి ఒంటరిగా యావత్ లోకాన్ని చుట్టేసింది. బెల్జియన్ మరియు బ్రిటీష్ జాతీయతను కలిగి ఉన్న రూథర్‌ఫోర్డ్ ప్రపంచాన్ని చుట్టేయాలని అనుకుంది. పైగా తను పైలట్ కూడా కావడంతో ఆ నిర్ణయం ఇంకా బలపడింది. తల్లిదండ్రులు కూడా ఫైలట్లు కావడంతో కూతురి నిర్ణయానికి అడ్డు చెప్పలేదు. జారా తండ్రి బ్రిటన్ వైమానిక దళంలో పనిచేస్తున్నాడు. ఆయన ధైర్యాన్ని పుణికిపుచ్చుకున్న జారా.. ఐదు నెలల క్రితం ఆగస్టు 18, 2021న తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తాజాగా గురువారం జారా..  బెల్జియన్ పట్టణం కోర్ట్రిజ్క్ వెలుపల ఉన్న ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండ్ అయింది. చిన్న వయసులోనే ప్రపంచాన్ని చుట్టి రావాలనే తన ఆశను నిజం చేసుకొని.. ఇప్పుడు రికార్డ్ సృష్టించడమే తరువాయిగా సిద్దంగా ఉంది. 

ఈ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి, పొందిన అనుభూతి గురించి పంచుకుంది. తాను మళ్లీ ఇక్కడకు తిరిగి రావడం వింతగా ఉందని జారా అన్నారు. ‘నేను ఈ ప్రయాణంలో దాదాపు 30 దేశాలు తిరిగాను. రష్యా, సైబీరియా ప్రాంతాలలో నా ప్రయాణం చాలా భయంకరమైనది భావిస్తాను. అక్కడ కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదైంది. నా ప్రయాణంలో మనుషులను చూడకుండా వందల కిలోమీటర్లు ప్రయాణించాను.  కరెంటు తీగలు లేవు, రోడ్లు లేవు, మనుషులు లేరు. రష్యన్ తూర్పు తీరప్రాంత పట్టణమైన అయాన్‌లో నవంబర్‌లో నా ప్రయాణం మూడు వారాల పాటు ఆగిపోయంది. అక్కడ వాతావరణం కారణంగా నా జర్నీకి అంతరాయం ఏర్పడింది’ అని జారా తెలిపింది. జారా కేవలం 325 కిలోగ్రాముల షార్క్ సింగిల్ ప్రొపెల్లర్ విమానంలో ప్రపంచాన్ని నావిగేట్ చేసింది.

For More News..

ప్యాసెంజర్ మాస్క్ పెట్టుకోలేదని ఫ్లైట్ నే వెనక్కి మళ్లించారు

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్కు డేట్ ఫిక్స్