
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టు విడుదల చేసింది. పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎంపీలు రాహుల్ గాంధీ, అధిర్ రంజన్ చౌదరి, పీజీ వాద్రా, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, హిమాచల్ సీఎం ఎస్ఎస్ సుఖు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ లకు జాబితాలో చోటు కల్పించింది. అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ చేసింది. 17మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. అగర్తలా నుంచి సుదీప్ రాయ్ బర్మన్‌ను పార్టీ బరిలోకి దింపనున్నట్టు సమాచారం.
మరోవైపు బీజేపీ కూడా తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. 60 స్థానాలకుగానూ 40మంది పేర్లను రిలీజ్ చేసింది. మిగతా వారి పేర్లను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పింది. ఫిబ్రవరి 16న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరుగనుంది.