గ్రేటర్ ఫైట్‌‌కు క్యాంపెయినర్ల లిస్ట్‌‌ను ప్రకటించిన కాంగ్రెస్

గ్రేటర్ ఫైట్‌‌కు క్యాంపెయినర్ల లిస్ట్‌‌ను ప్రకటించిన కాంగ్రెస్

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌లో వాతావరణం మారిపోయింది. అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తుండటంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. క్యాండిడేట్ల లిస్టును ప్రకటించిన పార్టీలు.. తాజాగా స్టార్ క్యాంపెయినర్ల లిస్టును వెల్లడించాయి. బల్దియా ఫైట్‌‌లో తమ పార్టీ తరఫున ప్రచార బరిలో హీటెక్కించనున్న పది మంది పేర్లను టీపీసీసీ ప్రకటించింది.

టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్‌‌ రెడ్డి, సీఎల్పీ నేత, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డితోపాటు మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజరుద్దీన్, వి.హనుమంత రావు, అంజన్ కుమార్ యాదవ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్ కుమార్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీలను పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా కాంగ్రెస్ ప్రకటించింది.