డీకేతో ఉత్తమ్ భేటీ.. సీఎంగా ఎవరైనా నాకు ఒకే

డీకేతో ఉత్తమ్ భేటీ.. సీఎంగా ఎవరైనా నాకు ఒకే

ఢిల్లీలో తెలంగాణ సీఎం ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కాసేపటి క్రితం డీకే శివకుమార్ తో కాంగ్రెస్ సీనియర్ నేత  ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం, కేబినెట్ పైన ఇద్దరు చర్చించినట్లు తెలుస్తోంది.  భేటీ అనంతరం మాట్లాడిన ఉత్తమ్ సీఎంగా ఎవరిని ప్రకటించినా తమకు ఆమోదమేనని చెప్పారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు.

సీఎం, ఇతర అంశాలపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు డీకే శివకుమార్. సీఎల్పీ నిర్ణయాన్ని హైకమాండ్ కు అందజేయడం వరకే తన చేతుల్లో ఉందన్నారు. సీఎం అభ్యర్థిని ఖర్గే ప్రకటిస్తారని చెప్పారు. 

మరో వైపు  ఢిల్లీలోని ఖర్గే నివాసంలో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్,డీకేతో రాహుల్ భేటీ అయ్యారు. సీఎం ఎంపికపై చర్చిస్తున్నారు. మరి  కాసేపట్లో సీఎం ఎవరనేది క్లారిటీ వస్తుంది. సీఎం,డిప్యూటీ సీఎం ఎవరన్నది అధిష్టానం ఖరారు చేసిన తర్వాత ఏఐసీసీ పరిశీలకులు మళ్లీ హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్ లొనే ముఖ్యమంత్రిపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లో   ఇవాళ( డిసెంబర్ 5న) సాయంత్రంలోపు సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తామని .. ఇవాళే సీఎం పేరును ప్రకటిస్తామని మల్లికార్జున ఖర్గే వెల్లడించిన సంగతి తెలిసిందే. 

తెలంగాణ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 64 సీట్లు..బీఆర్ఎస్ 39 సీట్లు ,బీజేపీ 8, ఎంఐఎం 7 సీట్లు గెలుచుకున్నాయి.