న్యూఢిల్లీ: మోదీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. దేశంలో నడుస్తున్నది అమృత్ కాల్ కాదని, ఇది ధరల భూకంపమని అభివర్ణించింది. ద్రవ్యోల్బణం, ఆహార, పానీయాల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా కొన్ని మీడియా కథనాలను పంచుకున్నారు.
‘మోదీ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం ప్రతి ఇంటి బడ్జెట్ను మింగేసే ఒక పిలవని అతిథిలా మారింది. వంటగది నుంచి ప్రతి నిత్యావసర వస్తువు ధరలు అదుపు తప్పాయి’ అని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల సామాన్యుల నడ్డి విరిగిందని విమర్శించారు.
