ఓట్ల తొలగింపుపై భగ్గుమన్న కాంగ్రెస్.. బీజేపీ ప్రయోజనాల కోసమే ఈసీ వ్యవహరిస్తోందని ఫైర్

ఓట్ల తొలగింపుపై భగ్గుమన్న కాంగ్రెస్.. బీజేపీ ప్రయోజనాల కోసమే ఈసీ వ్యవహరిస్తోందని ఫైర్
  • భారీగా ఆందోళనలు
  • మోదీ, అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మల దహనం

నెట్ వర్క్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసేందుకు కుట్ర చేస్తోందని, ఓటు చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్​ప్రజాప్రతినిధులు మండిపడ్డారు.

ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్​కు వ్యతిరేకంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్​ జిల్లాలో ర్యాలీలు, ఆందోళనలు చేపట్టారు. అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును మోదీ సర్కార్ కాలరాస్తోందని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు. 

కరీంనగర్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నల్ల రిబ్బన్లు ధరించి ఇందిరా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట సీఈ జ్ఞానేశ్ కుమార్, ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి, కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్​చార్జ్ వెలిచాల రాజేందర్ రావు, సుడా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్లు ఎదుట నిరసనలు
కేంద్ర ఎన్నికల కమిషన్ ​తీరును నిరసిస్తూ  కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ ప్రెసిడెంట్​మల్లిఖార్జున్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. సర్​పక్రియపై అభ్యంతరాలు, ఎన్నికల సంఘ తీరుపై మండిపడ్డారు. ఎన్నికల కమిషన్​ప్రధాన కమిషనర్​ జ్ఞానేశ్​ కుమార్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ ప్రెసిడెంట్​మల్లిఖార్జున్, లైబ్రరీ చైర్మన్​ చంద్రకాంత్​రెడ్డి, మున్సిపల్ చైర్​పర్సన్​ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రయోజనాల కోసమే ఈసీ పనిచేస్తోందని ఆదిలాబాద్​ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్​ డీసీసీ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణక్క ఆరోపించారు.

ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మోదీ, అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మల దహనం చేశారు.  జగిత్యాల కలెక్టరేట్ ఎదుట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గజంగి నందయ్య ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌‌‌‌‌‌‌‌తో కుమ్మక్కై సామాన్యుల ఓట్లను తొలగిస్తోందని, నిబంధనల ప్రకారం దరఖాస్తులు సమర్పించినా తనకు, మాజీ మంత్రికి కూడా నోటీసులు జారీ చేయడమే అందుకు నిదర్శనమని ఆరోపించారు.

ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
ప్రధానిగా రాజీవ్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌గాంధీ 18 ఏండ్ల యువతను ఓటర్లుగా మార్చి ప్రజాస్వామ్యాన్ని శక్తిమంతం చేస్తే బీజేపీ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ వ్యతిరేక ఓట్లను తొలగించి ఓట్​చోరీకి పాల్పడుతోందని ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శించారు. జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నిజామాబాద్​లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట డీసీసీ అధ్యర్యంలో చేపట్టిన ధర్నా శిబిరంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఉర్దూ అకాడెమీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాహెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెళ్లి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భవేశ్​‌‌‌‌‌‌‌‌మిశ్రాకు వినతిపత్రం అందజేశారు.

ప్రజల ఓటు హక్కును కాపాడాలని, ఓట్ల చోరీని అడ్డుకోవాలని నిర్మల్​డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కు చేరుకుని జాయింట్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. మంచిర్యాల, గోదావరిఖనిలో కాంగ్రెస్​నేతలు నిరసనలు తెలిపి ఈసీ జ్ఞానేశ్​కుమార్‌‌‌‌‌‌‌‌ దిష్టి బొమ్మలను దహనం చేశారు.