డిసెంబర్ 18 నుంచి కాంగ్రెస్ డొనేట్ ఫర్ దేశ్ ప్రచారం

డిసెంబర్  18 నుంచి కాంగ్రెస్  డొనేట్ ఫర్ దేశ్  ప్రచారం

న్యూఢిల్లీ :  2024 లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ బలోపేతానికిగానూ దేశవ్యాప్తంగా ఈ నెల 18 నుంచి క్రౌడ్ ఫండింగ్​కు వెళ్లనున్నట్లు వెల్లడించింది. 'డొనేట్ ఫర్ దేశ్' పేరిట నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రారంభించనున్నారు. శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్, కోశాధికారి అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ 138 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా..18 ఏండ్లు పైబడిన భారతీయులెవరైనా పార్టీకి రూ.138 మొదలు రూ.1380, రూ.13,800 ఇలా విరాళం ఇవ్వచ్చని చెప్పారు. 

ఈ నెల 28 వరకు ఆన్లైన్ వేదికగా, తర్వాత క్షేత్రస్థాయిలో విరాళాల సేకరణ చేపడతామన్నారు. వందేండ్ల క్రితం 1920~-21లో మహాత్మాగాంధీ ప్రారంభించిన ‘తిలక్ స్వరాజ్ ఫండ్’ స్ఫూర్తితో 'డొనేట్ ఫర్ దేశ్' చేపట్టినట్లు వెల్లడించారు. పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని 28న మహారాష్ట్రలోని నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో “ మముత్ ర్యాలీ”నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ  ర్యాలీలో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు 10 లక్షల మంది వరకు హాజరవుతారని వివరించారు. ఈ కార్యక్రమానికి “మెరుగైన దేశ్ కోసం ఐఎన్సీకి మీరు కావాలి. ఇండియాకు మీరు కావాలి” అనే ట్యాగ్‌‌‌‌‌‌‌‌లైన్ ఉంటుందని చెప్పారు. పార్టీ తన మద్దతుదారులతో కనెక్ట్ కావడానికి ఇదొక ప్రయత్నమని పేర్కొన్నారు.