సల్మాన్ కు కాంగ్రెస్ గాలం

సల్మాన్ కు కాంగ్రెస్ గాలం

భోపాల్ : లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ కంచుకోటల్ని బద్దలు కొట్టాలనుకుంటు న్న కాంగ్రెస్ , అందుకు బాలీవుడ్ కండల వీరుడి సాయం కోరింది.ఇండోర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ థి తరఫున ప్రచారం చేయాల్సిం దిగా సల్మాన్ ఖాన్ ను కోరినట్లు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది మంగళవారం మీడియాకు తెలిపారు. కేంద్రం ఉర్దూ భాషకు ప్రమోటర్ గా సల్మాన్ ను నియమించనుందన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చర్చకు దారితీసింది. సల్మాన్ పుట్టి పెరిగింది ఇండోర్ లోనేనని, సినిమాల కోసం ముంబైకి షిఫ్ట్​ అయినా స్థానికులతో  సంబంధాలున్నాయని, ఆయన ప్రచారం కాంగ్రెస్

కు మేలు చేస్తుందన్న చతుర్వే ది, తమ ప్రపోజల్ పై సల్మాన్ పాజిటివ్ గా స్పందిం చే అవకాశాలే ఎక్కువన్నారు. ఇండోర్ స్థానంలో 30 ఏండ్లు గా కాంగ్రెస్ ఓడిపోతూనే ఉంది. బీజేపీ తరఫున సుమిత్రా మహాజన్ ఎనిమిది సార్లు లోక్ సభకు ఎన్ని కయ్యా రు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ , లోక్ సభ ఎన్ని కల్లో నూ సత్తాచాటాలని భావిస్తున్నది. గతంలో ఇండోర్ మేయర్ ఎన్నికల్లో సల్మాన్ ప్రచారం చేసినా కాంగ్రెస్ ఓడిపోయింది. 2014లో గుజరాత్

కైట్ ఫెస్టివల్ కు హాజరైన సల్మాన్ , నాటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తడం, మోడీ పీఎం అయిన తర్వాత స్వచ్ఛభారత్ ప్రచారకర్తగా సల్మా న్ పేరును పరిశీలించడం తెలిసిందే.