ఈశాన్య రాష్ట్రాలను మేము అష్టలక్ష్మిగా చూస్తున్నం : మోడీ

ఈశాన్య రాష్ట్రాలను మేము అష్టలక్ష్మిగా చూస్తున్నం : మోడీ
  • ఈశాన్య రాష్ట్రాలను మేము అష్టలక్ష్మిగా చూస్తున్నం
  • నాగాలాండ్​ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ

 దీమాపుర్(నాగాలాండ్): కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ పాలనలో నార్త్ ఈస్ట్ ప్రాంతాన్ని ఒక ఏటీఎంలాగే చూశారని, కానీ తాము ఈశాన్యంలోని 8 రాష్ట్రాలను ‘అష్టలక్ష్మి’గా చూస్తున్నా మని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. నార్త్ ఈస్ట్​లో శాంతి, అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని తెలిపారు. శుక్రవారం నాగాలాండ్​లోని దీమాపుర్ జిల్లా చుముకేదీమా వద్ద బీజేపీ, ఎన్డీపీపీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నాగాలాండ్​లో శాశ్వత శాంతిని తెచ్చేందుకు కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే సాయుధ బలగాల(ప్రత్యేక అధికారాల) చట్టం, 1958ని రాష్ట్రంలో పూర్తిగా ఎత్తేశామన్నారు. ‘గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో విభజన రాజకీయాలు నడిచేవి. మేం వాటిని ‘డివైన్ ( ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్–పీఎండివైన్) గవర్నెన్స్’ గా మార్చాం. మతం, ప్రాంతం ఆధారంగా ప్రజలపై బీజేపీ వివక్ష చూపించదు’ అని మోడీ చెప్పారు. 

ఢిల్లీ, నార్త్ ఈస్ట్ మధ్య గ్యాప్ పోగొడ్తాం 

కాంగ్రెస్ పాలనలో నాగాలాండ్​లో రాజకీయ అస్థిరత్వం ఉండేదని మోడీ అన్నారు. నార్త్ ఈస్ట్ నుంచి ‘ఓట్లు పొందడం, మరిచిపోవడం’ అన్నదే కాంగ్రెస్, దాని మిత్రపక్షాల పాలసీగా ఉండేదదన్నారు. తాము ఢిల్లీకి, నార్త్ ఈస్ట్ మధ్య గ్యాప్​ తొలగించామన్నారు.  టెక్నాలజీతో అవినీతికి అడ్డుకట్ట  టెక్నాలజీని వాడటం ద్వారా తాము అవినీతికి అడ్డుకట్ట వేశామని ప్రధాని చెప్పారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి పంపిస్తున్న డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోకే చేరుతున్నాయన్నారు. నాగాలాండ్ విషయంలో శాంతి, ప్రగతి, సంక్షేమం అన్న 3 మంత్రాలనే ఎన్డీఏ సర్కారు అనుసరిస్తోందని తెలిపారు. 

మహిళకు ఎంపీ పదవి ఎన్డీఏ ఘనతే 

నాగాలాండ్ నుంచి మొదటిసారిగా ఓ మహిళను రాజ్యసభ ఎంపీగా చేసిన ఘనత ఎన్డీఏదేనని మోడీ అన్నారు. నాగాలాండ్​​లో హింసాత్మక ఘటనలు 75% తగ్గాయని, యువత మెయిన్ స్ట్రీమ్​లోకి వస్తున్నారని చెప్పారు. నార్త్ ఈస్ట్​లో చేపట్టిన అభివృద్ధి పనులే దీనికి నిదర్శనమన్నారు.

కమలం వికసిస్తది 

కాంగ్రెస్ పాలనలో రోడ్లు, రైల్వే, ఎయిర్ కనెక్టివిటీ లేక మేఘాలయ వెనకబడిందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో సానుకూల మార్పులు వచ్చాయని ప్రధాని మోడీ అన్నారు. శుక్రవారం షిల్లాంగ్​లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఢిల్లీతో పాటు రాష్ట్రంలో కూడా కుటుంబపాలన వల్లే అభివృద్ధి జరగలేదని, అందుకే ఇప్పుడు అందరూ బీజేపీనే కోరుకుంటున్నారని అన్నారు. దేశంతో పాటు మేఘాలయలో కమలం వికసిస్తుందన్నారు. ‘‘మోడీ సమాధి తవ్వుతామంటూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నినదిస్తున్నా.. దేశం మాత్రం మోడీ కమలమే వికసిస్తుందని చాటుతోంది’’ అంటూ వ్యాఖ్యానించారు.