TRSకి ప్రజలు సరైన బుద్ది చెప్పారు : ఉత్తమ్

TRSకి ప్రజలు సరైన బుద్ది చెప్పారు : ఉత్తమ్

రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు సరైన బుద్ది చెప్పారన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.  లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిని గాంధీభవన్ లొ కాంగ్రెస్ నేతలు సన్మానించారు.  నియంతపోకడతో వెళ్తున్న టీఆర్ఎస్ కు ఈ ఫలితాలు ఓ గుణపాఠమన్నారు.  పార్లమెంట్ లో రాష్ట్ర హక్కులపై పోరాడతామన్నారు. రానున్న రోజుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ లక్కిగా గెలిచిందని విమర్శించారు.