ఓజీ ఫైరింగ్ పూర్తి... సెప్టెంబర్ 25న రిలీజ్ కి రెడీ..

ఓజీ ఫైరింగ్ పూర్తి... సెప్టెంబర్ 25న రిలీజ్ కి రెడీ..

పవన్ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘ఓజీ’ ఒకటి.  సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.  ప్రియాంక మోహన్ హీరోయిన్.  ఇమ్రాన్ హష్మీ విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించగా, తాజాగా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని తెలియజేశారు మేకర్స్. 

‘ఫైరింగ్ పూర్తయింది. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపడానికి సిద్ధంగా ఉంది’ అంటూ షూటింగ్ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ను అందించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన స్టిల్‌‌‌‌‌‌‌‌లో పవన్ కళ్యాణ్ గన్ పట్టుకుని ఇంటెన్స్ లుక్‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది. మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.