యూఎస్ జెనరిక్ వ్యాపారం నుంచి వొక్హార్డ్ ఔట్

యూఎస్ జెనరిక్ వ్యాపారం నుంచి వొక్హార్డ్ ఔట్
  • యాంటీబయాటిక్స్, డయాబెటిస్ కేర్‌‌‌‌‌‌‌‌పై దృష్టి

ముంబై: భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ వొక్‌‌‌‌‌‌‌‌హార్డ్ అమెరికాలోని తన జెనరిక్ మందుల వ్యాపారం నుండి వైదొలగాలని నిర్ణయించుకుంది. నష్టాలు వస్తున్న ఈ విభాగాన్ని మూసివేసి, కొత్త మందుల ఆవిష్కరణ,  లాభదాయకమైన రంగాలపై దృష్టి పెడతామని కంపెనీ ప్రకటించింది. కంపెనీ తన యూఎస్​ అనుబంధ సంస్థలైన వొక్‌‌‌‌‌‌‌‌హార్డ్ యూఎస్ఏ, మోర్టన్ గ్రోవ్ ఫార్మాస్యూటికల్స్ కోసం  లిక్విడేషన్ ప్రక్రియలను ప్రారంభించింది. ది. 

 వొక్‌‌‌‌‌‌‌‌హార్డ్ ఇకపై యాంటీ బయాటిక్ డ్రగ్స్​ పరిశోధన, అభివృద్ధి,  డయాబెటిస్ కేర్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన బయోలాజికల్ ఉత్పత్తుల (ఇన్సులిన్ వంటివి) పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోపై మరింత దృష్టి సారించనుంది.  గత కొన్నేళ్లుగా యూఎస్​ జెనరిక్ వ్యాపారం నష్టాలను చవిచూసిందని, 2025 ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 8 మిలియన్ డాలర్ల నష్టం వచ్చిందని వొక్‌‌‌‌‌‌‌‌హార్డ్ పేర్కొంది.