
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ మహిళా నేతలు ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో మహిళా నేతలు, కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముట్టడికి ప్రయత్నించిన మహిళా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.
తమ నాయకుడి బొమ్మను దహనం చేయడంపై మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని.. కేసీఆర్కు రోజులు దగ్గరపడ్డాయని మండిపడ్డారు. కేసీఆర్ పుట్టిన రోజు ఎలా జరుపుకుంటాడో చూస్తామని హెచ్చరించారు.
For more news..
చైనా కంపెనీకి ఐటీ శాఖ షాక్
ఆకాశం నుంచి కింద పడిన పక్షిరాజు