
గాంధీభవన్ దగ్గర మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు తోపులాట జరిగింది. మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మహిళా కాంగ్రెస్ చైర్మన్ సునీతారావ్.. సొమ్మసిల్లి కిందపడిపోయారు. ఆమెకు స్వల్ప గాయాలవడంతో కేర్ హాస్పిటల్ కు తరలించారు. మహిళా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.