పానగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీపీ పై దాడి.. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకుల రాస్తారోకో 

పానగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీపీ పై దాడి..  బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకుల రాస్తారోకో 
  •   తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని  పోలీసులకు ఫిర్యాదు

పానగల్, వెలుగు:  పానగల్  మండల ఎంపీపీ శ్రీధర్ రెడ్డి పై ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారని మండల బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు.   బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ మాట్లాడుతూ..   బుధవారం రాత్రి 9 గంటల సమయంలో పెద్దమ్మ గుడి వద్ద ఎంపీపీ మాట్లాడుతుండగా..   గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు ఆది శ్రీను, ఆది స్వామి తమకు దళితబంధు రాకపోవడానికి  నీవే  కారణమని నిన్ను చంపుతామని దుర్భాషలాడారు.  

వెంట తెచ్చుకున్న డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంపీపీ ఒంటిపై చల్లి అంటించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.   అక్కడ ఉన్న వారు విడిపించగా వాళ్లపై కూడా దాడి చేశారన్నారు.  ఎంపీపీ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా  ఇద్దరిని  స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిలిపించి వదిలేశారు.  దీంతో సదరు వ్యక్తులు మళ్లీ ఎంపీపీపై  దాడి చేశారని ఆరోపించారు.  నిందితులపై కేసు నమోదు చేసే వరకు  రాస్తారోకో విరమించేది లేదని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు.   ఆ ఇద్దరు కాంగ్రెస్ నాయకులతో తనకు ప్రాణ భయం ఉందని ఎంపీపీ శ్రీధర్ రెడ్డి అన్నారు.  

వనపర్తి సీఐ మహేశ్వర్ రావు, వనపర్తి పట్టణ, రూరల్ ఎస్సైలు యుగందర్ రెడ్డి, నాగన్న మాట్లాడుతూ..   నిందితులపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.  నిందితులను రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపించినట్లు పానగల్ ఎస్సై వేణు తెలిపారు.  విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకులు ఎంపీపీ శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేయడం సరికాదన్నారు.  కొల్లాపూర్ నియోజకవర్గంలో గత అయిదేళ్లలో ఎలాంటి దాడులు జరగలేవన్నారు.