కాంగ్రెస్ మెగా ర్యాలీకి భారీగా తరలివస్తున్న కార్యకర్తలు 

కాంగ్రెస్ మెగా ర్యాలీకి భారీగా తరలివస్తున్న కార్యకర్తలు 

ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగం, జీఎస్టీకి వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొనేందుకు పాదయాత్రగా వెళ్తున్న నేతలు, కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. బంగా భవన్ నుంచి అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి నిరసనకారులు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ చేపట్టే మెగా ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తుండగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ర్యాలీ దృష్ట్యా ఢిల్లీలోని రాంలీలా మైనదానం సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. కొన్ని రోడ్లు మూసేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు. ర్యాలీ జరిగే ప్రాంతాల్లో స్థానిక పోలీసులతో పాటు.. పారామిలటరీ బలగాలు మోహరించాయి. రాంలీలా మైదానం దగ్గర ఎంట్రీ పాయింట్ల దగ్గర మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు.

ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరగనున్న ఈ నిరసన... దేశంలోనే అతిపెద్ద ర్యాలీలలో ఒకటిగా నిలుస్తుందని  కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈనెల 7 నుంచి కాంగ్రెస్ పార్టీ ‘‘భారత్ జోడో యాత్ర’’ పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్రను ప్రారంభించనుంది.