తొలిసారి రాజ్యసభకు సోనియా

తొలిసారి రాజ్యసభకు సోనియా
  • ఆమెతో సహా 14 మంది రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం 

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఆమెతో సహా 14 మందితో రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.‌ సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఉన్నారు. ఆయన ఒడిశా నుంచి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. 

అజయ్ మాకెన్ (కర్నాటక), సయ్యద్ నజీర్ హుస్సేన్ (కర్నాటక), ఆర్ఎన్పీ సింగ్ (ఉత్తరప్రదేశ్), సమిక్ భట్టాచార్య (వెస్ట్ బెంగాల్), సంజయ్ కుమార్ ఝా (బిహార్), సుభాశిష్ ఖుంతియా (ఒడిశా), దేబాశిష్ సామంతరాయ్ (ఒడిశా), మదన్ రాథోడ్ (రాజస్థాన్)‌ తదితరులు ఉన్నారు.‌ సోనియా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె కూతురు ప్రియాంక గాంధీ, సభా నాయకుడు పీయూష్‌ గోయెల్‌, కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు.