రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇవాళ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి పాత్రపై కూడా విచారణ చేపట్టనున్నారు. మంత్రి హత్య కుట్ర కేసులో నిందితులకు జితేందర్ రెడ్డి పీఏ, డ్రైవర్ ఆశ్రయం ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను చర్లపల్లి జైలుకు సైబరాబాద్ పోలీసులు తరలించారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాగరాజు అనే వ్యక్తి భార్య కీలక వ్యాఖ్యలు చేశారు.
తప్పుడు కేసులు పెట్టి పోలీసులు తమను వేధిస్తున్నారన్నారు. దొంగాళ్ళెక్క వచ్చి ఫిబ్రవరి 23వ తేదీని తన రోజు నా భర్తను కిడ్నాప్ చేశారన్నారు.23న పోలీసులు మహబూబ్నగర్ నుంచి నాగరాజు ను తీసుకుని వెళ్తే.. పేట్ బషీరాబాద్ లో 25న దాడి ఎలా చేస్తాడు.? అని ఆమె ప్రశ్నించారు. ఫరూక్, హైదర్ ఆలీ లకు సూపరి నాగరాజు ఇస్తే...తీస్కున్నది ఫారూఖ్, హైదర్ అలీ .. కాబట్టి వాళ్లు కూడా నిందితులే కదా అన్నారు. వాళ్ళు బయట ఎందుకు ఉన్నారు వాళ్ళను సైతం అరెస్ట్ చెయ్యాలన్నారు.
రోడ్ల పై కత్తులతో దాడి అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ అంటున్నారు సిటీ లో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్నాయి.. ఆ దృశ్యాలు బయట పెట్టండి? అని నాగారాజు భార్య డిమాండ్ చేశారు.జైల్లో ఉన్న భర్త తో మాట్లాడిన.. SOT పోలీసులు కార్లో తీసుకుని వచ్చారని చెప్పారన్నారు. 15 కోట్లు ఇచ్చే స్థోమత తమకు ఉందో లేదో పోలీసులే విచారణ చేసి చెప్పాలన్నారు. పోలీసులు, ప్రభుత్వం మీద నమ్మకం లేదన్నారు. సీబీఐతో విచారణ చేసి న్యాయం చెయ్యాలని నాగరాజు భార్య కోరారు.
ఇవి కూడా చదవండి:
