సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర..స్కాములపై సీబీఐ విచారణ జరిపించాలి

సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర..స్కాములపై సీబీఐ విచారణ జరిపించాలి
  •  సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌రావు

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/జమ్మికుంట, వెలుగు : సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని, సింగరేణిలో జరిగే స్కామ్‌‌‌‌‌‌‌‌లపై సీబీఐ, విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ విచారణ జరపాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లిలో జరిగిన సింగరేణి పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై కేంద్రమంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. 

కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలతో సింగరేణిని ఆగం చేస్తున్నాయని, సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి నోరు విప్పితే సింగరేణికి బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ బాకీ పడిందంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిని ఆదానీకో, అంబానీకో అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కమిషన్ల కోసం సింగరేణికి సోలార్, పంప్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ స్టోరేజ్ ప్రాజెక్టులను అప్పగిస్తున్నారని, రూ. వెయ్యి కోట్లతో జైపూర్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ స్కాంకు తెరలేపారన్నారు. 

రూ. 480 కోట్లతో నిర్మించిన సోలార్​ప్లాంట్‌‌‌‌‌‌‌‌ నిరుపయోగంగా మారిందని, 107 మెగావాట్ల ప్లాంట్‌‌‌‌‌‌‌‌కు రూ.504 కోట్లతో టెండర్ పిలిస్తే అదీ మూలకు పడిందన్నారు. కార్యక్రమంలో శాసనమండలి పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, పుట్ట మధు, సాంబారి సమ్మారావు, పాల్గొన్నారు. 

అనంతరం జమ్మికుంటలో జరిగిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌‌‌‌‌‌‌‌రావు మాట్లాడుతూ రైతు డిస్కం వస్తే వ్యవసాయానికి నాలుగైదు గంటలకు మించి కరెంట్‌‌‌‌‌‌‌‌ సప్లై ఉందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా రైతులెవరూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఓటేసే పరిస్థితిలో లేరన్నారు. కార్యక్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మాజీ మంత్రి జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సతీష్‌‌‌‌‌‌‌‌బాబు, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌, రాకేశ్‌‌‌‌‌‌‌‌, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్‌‌‌‌‌‌‌‌ దిలీప్ పాల్గొన్నారు.