
కేసముద్రం, వెలుగు: కేసముద్రం మండలంలోని కల్వల, ఉప్పరపల్లి గ్రామాలకు గురువారం ఉదయం 7 గంటలకు యూరియా రావాల్సి ఉంది. ఉదయం 5 గంటల నుంచే రైతులు బారులు తీరారు. లారీడ్రైవర్కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో 11 గంటలకు మండల కేంద్రంలోని దర్గా వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి లారీ నడపలేకపోయాడు. కానిస్టేబుల్అలీమ్లారీని స్వయంగా నడుపుతూ రైతుల వద్దకు తీసుకెళ్లి, యూరియా అందేలా చూశాడు. అతన్ని ఉన్నతాధికారులు, రైతులు అభినందించారు.