దున్నపోతులకు వినతిపత్రం ఇవ్వనున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు

దున్నపోతులకు వినతిపత్రం ఇవ్వనున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు

సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‭లో కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు ఉద్యమకార్యాచరణ ప్రకటించారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 6న దున్నపోతులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. 7న అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 9న ఛలో హైదరాబాద్ కు పిలుపునిచ్చిన అభ్యర్థులు పాత విధానంలోనే కానిస్టేబుల్, ఎస్సై రిక్రూట్ మెంట్ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

దేశంలో 4 మీటర్ల లాంగ్ జంప్ ఎక్కడా లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 200 మార్కుల క్వశ్చన్ పేపర్‭లో 20 ప్రశ్నలు తప్పుగా ఇచ్చారని మండిపడుతున్నారు.పేద విద్యార్థుల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేశారని.. విద్యార్థుల డబ్బులతోనే రిక్రూట్‭మెంట్స్ నిర్వహిస్తున్నారని విమర్శించారు. లాంగ్ జంప్ కారణంగా వందల మంది కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు అర్హులు కాకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.