కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో విషాదం చోటు చేసుకుంది. వీణవంక మండలం ఎల్భాక గ్రామానికి చెందిన బొల్లం దేవేందర్ రెడ్డి(30) కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్ దేవేందర్ రెడ్డి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు నెలల క్రితమే మృతుడు కానిస్టేబుల్ జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడటంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దేవేందర్ సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయని పోలీసులు దర్వాప్తు చేస్తున్నారు.
ALSO READ | స్పీడ్ తగ్గించాలని అన్నందుకే.. కానిస్టేబుల్‌ను కారుతో గుద్ది చంపిన్రు