రికార్డ్ బ్రేకింగ్‌‌‌‌ వ్యూస్‌‌‌‌తో..కానిస్టేబుల్‌‌‌‌ కనకం

రికార్డ్ బ్రేకింగ్‌‌‌‌ వ్యూస్‌‌‌‌తో..కానిస్టేబుల్‌‌‌‌ కనకం

ఇటీవల ఈటీవీ విన్‌‌‌‌ ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లో విడుదలైన   కానిస్టేబుల్‌‌‌‌ కనకం, ఆల్‌‌‌‌ ఇండియా ర్యాంకర్స్‌‌‌‌, అనగనగా చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చాయని,  ప్రతి చిత్రం రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌‌‌‌తో  ట్రెండింగ్ లో స్ట్రీమ్ అవుతున్నాయని ఆయా మూవీ మేకర్స్ చెప్పారు. ఈ సందర్భంగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌‌‌‌ని  నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో మూడు చిత్రాలకు సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్స్ పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.  మరిన్ని మంచి చిత్రాలతో   ముందుకువచ్చేలా సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు  ఈటీవీ విన్  కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి,  ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ థ్యాంక్స్ చెప్పారు.