Constable Kanakam Review: ఓటీటీలో ట్రెండింగ్లోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Constable Kanakam Review: ఓటీటీలో ట్రెండింగ్లోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తెలుగు ఆడియన్స్ అందరికీ ‘కానిస్టేబుల్ కనకం’పేరు గుర్తే ఉండుంటుంది. ఇటీవలే, ఓ రెండు తెలుగు వెబ్ సిరీస్‌‌‌‌ లు తమ కథను కాపీ కొట్టారంటూ ఒకరికొకరు వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. అందులో ఒకటే ఈ  ‘కానిస్టేబుల్ కనకం’. మరొకటి ‘విరాట పాలెం : పీసీ మీనా రిపోర్టింగ్‌‌‌‌’.అయితే, ఆ వివాదం గురించి పక్కనపెడితే.. పీసీ మీనా రిపోర్టింగ్‌‌‌‌’జూన్ 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్కి వచ్చి ఆకట్టుకుంది. మరి ఇపుడు కానిస్టేబుల్ కనకం గురించి తెలుసుకుందాం. 

కానిస్టేబుల్ కనకం:

వర్ష బొల్లమ్మ లీడ్ రోల్‌‌‌‌లో నటించిన ఈ సిరీస్ని ప్రశాంత్ కుమార్ దిమ్మల తెరకెక్కించాడు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ నిర్మించారు. రాజీవ్ కనకాల, మేఘలేఖ, రమణ భార్గవ్ కీలక పాత్రలు పోషించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. శ్రీరామ్ ముక్కపాటి సినిమాటోగ్రఫీగా వర్క్ చేశారు. 

కానిస్టేబుల్ కనకం ఓటీటీ:

ఈ వెబ్ సిరీస్‌‌‌‌ గురువారం (ఆగస్టు 14) నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. రిలీజైన ఫస్ట్ డే నుంచే, ఈటీవీ విన్ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 1 ప్లేస్ దక్కించుకుంది. అందుకు ముఖ్య కారణం ఈ సిరీస్ కథ, అందులోని సస్పెన్స్ అంశాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా అడవి ప్రాంతంలోని ఓ మారుమూల పల్లెటూరిలో కానిస్టేబుల్ కనకం కథ మొదలవుతుంది. అక్కడ వరుసగా అమ్మాయిలు అదృశ్యమవ్వడంతో తీవ్ర భయాందోళనలో ఉంటుంది ఆ గ్రామం. ఎందుకు ఇలా అవుతుందనేది అదొక మిస్టరీగా మిగిలిపోతుంది. ఈ క్రమంలో కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుల్ కనకం ఊరికి ఎంట్రీ ఇస్తుంది. మిస్టరీని ఛేదించే దిశగా.. కనకానికి ఎదురయ్యే సంఘటనల ఏంటనేది మిగతా కథ.

ఇందులో సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్, హారర్ అంశాలతో ప్రశాంత్ తెరకెక్కించిన విధానం క్యూరియాసిటీ కలిగిస్తుంది. కొన్నిసార్లు భయపెడుతుంది కూడా. ప్రస్తుతం ఈ సిరీస్ ట్రెండింగ్లో ఉండటంతో వ్యూస్ మరింత పెరుగుతున్నాయని సదరు ఓటీటీ  సంస్థ తెలిపింది.

కానిస్టేబుల్ కనకం కథ:

1990ల కాలంలో ఈ కథ నడుస్తుంది. శ్రీకాకుళంలోని రేపల్లె అనే మారుమూల గ్రామం. ఈ గ్రామంలో అడవి గుట్ట అనే ఒక రహస్య ప్రాంతం ఉంటుంది. దట్టమైన అడవి, భయపెట్టే పరిసరాలతో ఇది నిండుకుని ఉంటుంది. ఈ ప్రాంతంలోకి వెళ్లిన మహిళలు ఒక్కొక్కరిగా కనిపించకుండా పోతుంటారు. ఈ క్రమంలో ఆ గ్రామస్థులు ఓ కఠిన నిర్ణయం తీసుకుంటారు.

ఇదే టైంలో రేపల్లెలో కనక మహాలక్ష్మి అలియాస్ కనకం(వర్ష బొల్లమ్మ) కానిస్టేబుల్‌గా పోస్టింగ్ తీసుకుంటుంది. ఒక రోజు కనకం స్నేహితురాలు చంద్రిక (మేఘ లేఖ) కనిపించకుండా పోతుంది.

అసలు ఆ గ్రామస్థులు తీసుకున్న కఠిన నిర్ణయం ఏమిటీ? కనిపించకుండా పోయిన మహిళలు ఏమయ్యారు? అసలు చంద్రిక ఏమైంది? మిస్టరీని ఛేదించాలన్న లక్ష్యంతో ఉన్న కనకనాకి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? ఈ అదృశ్య మహిళల వెనకాల దాగున్న చీకటి రహస్యం ఏంటీ? చివరికి కనకం కనుక్కుందా? అనేది ఈ సిరీస్ కథ.