సీఎం టూర్ బందోబస్తులో కానిస్టేబుల్కు గుండెపోటు

సీఎం టూర్ బందోబస్తులో కానిస్టేబుల్కు గుండెపోటు

జగిత్యాల: రేపటి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన పరుశురామ్ (50) అనే కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు. ఇంద్రవెళ్లి నుంచి సీఎం టూర్ బందోబస్తు కోసం జగిత్యాల పోలీసు స్టేషన్ కు వచ్చిన కాసేపటికే గుండెపోటుతో కూలబడిపోగా.. గుర్తించిన సహచర పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 

అయితే అప్పటికే ఆలస్యం కావడంతో వైద్యుల ప్రయత్నం ఫలించలేదు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం చనిపోయారు. కానిస్టేబుల్ పరుశురామ్ అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం ఓదెలు గ్రామస్తుడు. సీఎం బందోబస్తు కోసం వచ్చిన కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందిన ఉదంతం పోలీసు వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.