పెరిగిన పొల్యూషన్.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం..

పెరిగిన పొల్యూషన్.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం..

దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ మరోసారి భారీగా పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 399గా రికార్డ్ అయింది. దీంతో ఎయిర్ క్వాలిటీ వెరీ పూర్ కేటగిరీలో కంటిన్యూ అవుతుంది. ఎయిర్ పొల్యూషన్ పెరగడంతో ఢిల్లీ ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. నిర్మాణ, పారిశ్రామిక పనులపై నిషేధం విధించింది. ఎంప్లాయిస్ వర్క్ ఫ్రం హోమ్ నిర్వహించాలని ప్రకటించింది. మరో రెండు రోజుల పాటు తీవ్ర వాయు కాలుష్యం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ తో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు.

గాలి నాణ్యత ప్రమాణాలు ఇలా..

గాలి నాణ్యత సున్నా నుండి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని.. 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత, 301నుంచి 400 చాలా పేలవమైనది, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయి అని సూచన. వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేజ్రీ సర్కార్ తగిన చర్యలు చేపడుతోంది.