నిధులున్నా.. పనులు పూర్తికాలే..!

నిధులున్నా.. పనులు పూర్తికాలే..!

హనుమకొండ జిల్లా కమాలాపూర్​మండల పరిధిలోని గూడూరు అంగన్​వాడీ భవన నిర్మాణం ప్రారంభమై ఐదేళ్లు అవుతున్నది. నిధులు మంజూరు చేసినా భవనం మాత్రం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దీంతో అంగన్​వాడీ కేంద్రం అద్దె భవనంలో ఒకే గదిలో కొనసాగుతున్నది. చిన్నపాటి అద్దె గదిలోనే సామగ్రి ఉంచడం, వండిపెట్టడం, చిన్నారులకు ప్రాథమిక విద్యనందించడం కష్టంగా మారింది.

 మూత్రశాలలు, నీటి సరఫరా తదితర సౌకర్యాలు లేకపోవడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు చొరవ చూపి ఇప్పటికైనా సొంత భవనం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని తల్లిదండ్రులు, ప్రజలు కోరుతున్నారు.  

 కమలాపూర్, వెలుగు