16 వేల బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం

16 వేల బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం

జగిత్యాల టౌన్, వెలుగు : బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం నమూనా తయారు చేశాడు జగిత్యాలకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ గుర్రం దయాకర్. ఈనెల 22న రామ్​లల్లా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ కళాఖండం తయారు చేసినట్లు ఆయన తెలిపారు. 60 గంటలకు పైగా శ్రమించి 16 వేల బియ్యపు గింజలతో మందిర నమూనాను రూపొందించినట్లు చెప్పారు. ఈ కళాఖండాన్ని ప్రధాని మోదీకి అందజేస్తానని తెలిపారు.

కరీంనగర్‌‌‌‌లో బాల రాముడు

అయోధ్య రామమందిరంలో కొలువుదీరబోతున్న బాల రాముడి ప్రతిమను పోలిన సైకత శిల్పాన్ని కరీంనగర్ భాగ్యనగర్ లో రేవెల్లి శంకర్ అనే శిల్పి రూపొందించాడు. బాల రాముడి సైకత శిల్పాన్ని చూసేందుకు వచ్చిన మహిళలు దీపాలు పెట్టి పూజలు చేశారు. పలువురు సెల్ఫీలు దిగుతూ కరీంనగర్ బాలరాముడు అంటూ స్టేటస్ పెట్టుకున్నారు.