సెల్ ఫోన్ డ్రైవింగ్ డేంజర్..బైక్ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన భారీ కంటైనర్

 సెల్ ఫోన్ డ్రైవింగ్ డేంజర్..బైక్ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన భారీ కంటైనర్

మీరు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారా..? ఫోన్ను భుజానికి చెవికి మధ్యలో పెట్టుకుని మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నారా..అయితే ఈ వీడియో మీకోసమే. ఒక్కసారి ఈ భయంకర వీడియో చూస్తే..మీరు మళ్లీ ఫోన్లో మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయరు. 
  
7 సెకన్ల ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు  బైక్పై ఓ హైవేను దాటేందుకు క్రాస్ రోడ్డు దగ్గర ఆగుతారు. ఇంతలో  మరో వ్యక్తి  బైక్ నడుపుకుంటూ ఫోన్ మాట్లాడుతూ రోడ్డును దాటేందుకు ప్రయత్నిస్తాడు.  హైవేలో వచ్చే వాహనాలను చూసుకోకుండా అలాగే వెళ్తాడు. ఇంతలో వంద వేగంతో వెళ్లే ఓ భారీ కంటైనర్ అతన్ని బలంగా ఢీకొడుతుంది. కొద్ది దూరం అలాగే ఈడ్చుకెళ్తుంది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి కంటైనర్ ముందు చక్రాల కింద పడి నుజ్జు నుజ్జు అవుతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సాధారణంగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని నిబంధనలు ఉన్నాయి. అయితే వాహనదారులు మాత్రం ఈ నిబంధనను పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యానికి ఘోర మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. అందుకు ఈ వీడియోనే సరైన ఉదాహరణ.