సుశీ ఇన్ ఫ్రాలో GST దాడులు..డాక్యుమెంట్లు,హార్డ్ డిస్క్ లు స్వాధీనం

సుశీ ఇన్ ఫ్రాలో GST దాడులు..డాక్యుమెంట్లు,హార్డ్ డిస్క్ లు స్వాధీనం

బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని సుశీ ఇన్ ఫ్రాలో GST అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. సుశీ అనుబంధ సంస్థల్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. GST చెల్లింపులపై వారు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఉద్యోగులను బయటకు వెళ్లొద్దని ఆదేశించారు. ఆఫీస్ సమయం అయిపోవడంతో.. ఉద్యోగులను బయటకు వెళ్లకుండా ఆపివేశారు. దాదాపు 50మంది ఉద్యోగుల దగ్గర మొబైల్స్‭ను స్వాధీనం చేసుకున్నారు. 

అయితే దాడుల కంటే ముందే ఉదయం నాంపల్లి కమిషనర్ ఆఫీసులో.. 5డివిజన్లకు సంబంధించిన జీఎస్టీ అధికారులు సమావేశమయ్యారు. ఆ తర్వాతే అంతా కలిసి సుశీ ఇన్ ఫ్రాలో తనిఖీలు చేస్తున్నారు. బంజారాహిల్స్‭లోని ఆఫీసులో ఇద్దరు డిప్యూటీ కమీషనర్లతో పాటు 20 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా ఇంకా సుశీ ఇన్ ఫ్రా కార్యాలయంలోనే తనిఖీలు కొనసాగిస్తున్నారు. స్టేట్ జీఎస్టీ కింద కట్టాల్సిన పన్నులను ఎగ్గొట్టినట్లు ఆరోపిస్తూ.. సుశీ ఇన్ ఫ్రాపై  జీఎస్టీ ఆఫీసర్లు సోదాలు  చేస్తున్నారు.