
కోల్‌బెల్ట్, వెలుగు: శ్రీరాంపూర్ఏరియాలోని అండర్ గ్రౌండ్ బొగ్గు గనులకు సింగరేణి థర్మల్‌పవర్ ప్లాంట్ నుంచి నిరంతరం బాటమ్ యాష్ట్రాన్స్పోర్ట్ చేయాలని సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్ అన్నారు. జైపూర్సింగరేణి థర్మల్‌పవర్ ప్లాంట్‌కు బాటమ్ యాష్రవాణాపై ప్లాంట్ఈడీ చిరంజీవులు, ఇతర ఆఫీసర్లతో ఆదివారం జీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియాలోని ఇందారం1ఏ, ఎస్పార్సీ3, ఆర్కే-7 అండర్ గ్రౌండ్ మైన్ల స్ట్రవింగ్కు కావాల్సిన బాటమ్యాష్రవాణాలో జాప్యం లేకుండా చూడాలన్నారు.
పని స్థలాల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం లేకుండా యాష్సప్లైకి అవసరమైన చర్యలను మరింత పకడ్బందీగా చేపట్టాలని కోరగా అందుకు ప్లాంట్ఈడీ, ఆఫీసర్లు అంగీకరించారు. సమావేశంలో ఎస్టీపీపీ జీఎం శ్రీనివాస్, ఆర్కే7, ఇందారం, ఎస్సార్పీ3, 3ఏ గ్రూపు గనులు ఏజెంట్లు కుర్మా రాజేందర్, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, సీహెచ్.వెంకటేశ్వర్లు, ఎస్టీపీపీ ఆఫీసర్లు సబ్బని లక్ష్మణ్, కేవీ శ్రీనివాస్ పాల్గొన్నారు.