కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల రెగ్యులరైజేషన్ కుదరదు: హరీష్రావు

కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల రెగ్యులరైజేషన్ కుదరదు: హరీష్రావు

హరీష్రావు  ఇంటి ముట్టడికి యత్నించిన ఏఎన్‌ఎంలు

హైదరాబాద్, వెలుగు: తమ ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు గురువారం మంత్రి హరీశ్‌రావు ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. సీఐటీయూ నేతృత్వంలో ఏఎన్‌ఎంలు ఈ కార్యక్రమాన్ని తలపెట్టగా నార్సింగి పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.  సీఐటీయూ వైస్‌ ప్రెసిడెంట్ భూపాల్ నేతృత్వంలో 20 మంది ఏఎన్‌ఎంలను మంత్రి హరీశ్‌తో మాట్లాడేందుకు పోలీసులు తీసుకెళ్లారు. 

ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్ చేయడం కుదరదు అని మంత్రి హరీశ్​రావు  స్పష్టం చేశారు. ఏఎన్‌ఎంలకు న్యాయం చేసేందుకు, వారికి రెగ్యులర్ నియామకం కోసం జరిపే పరీక్షల్లో 30 మార్కులు వెయిటేజీ ఇస్తున్నామని, 53 ఏండ్ల వరకూ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చామని మంత్రి చెప్పారు. ఏఎన్‌ఎంల రెగ్యులరైజేషన్ గురించి మాట్లాడేందుకు వెళ్లిన తమ నేత భూపాల్‌ను హరీశ్‌ రావు అవమానించారని సీఐటీయూ ఆగ్రహం వ్యక్తం చేసింది.