రేపు ఓయూలో కాంట్రాక్ట్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్ల సదస్సు

రేపు ఓయూలో  కాంట్రాక్ట్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్ల సదస్సు

ఓయూ, వెలుగు: రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్​చేస్తూ ఈ నెల 9న ‘చలో ఉస్మానియా’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్-  జాయింట్ యాక్షన్ కమిటీ  నాయకులు పరశురాం, డి.ధర్మతేజ, వేల్పుల కుమార్, వెంకటేశ్​తెలిపారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద వారు మీడియాతో మాట్లాడారు. వచ్చే శుక్రవారం చలో ఉస్మానియా పేరుతో ఆర్ట్స్ కాలేజీలోని రూమ్​నంబర్​57లో ‘కాంట్రాక్ట్​అసిస్టెంట్ ప్రొఫెసర్ల మహా సదస్సు’ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

చీఫ్​గెస్ట్​గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి,  గౌరవ అతిథులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి న్యూస్​పేపర్​ఎడిటర్ శ్రీనివాస్, ఓయూ మాజీ వీసీలు ప్రొ.రామచంద్రం,  ప్రొ.సత్యనారాయణ, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.పద్మావతి,  పాలమూరు యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.రాజారత్నం హాజరవుతున్నారని వెల్లడించారు. మహా సదస్సుకు రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల నుంచి పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు హాజరవుతున్నారని జేఏసీ నాయకులు తెలిపారు.