ఐవీఏసీల ఏర్పాటుకు బీఎల్ఎస్కు కాంట్రాక్టు..

 ఐవీఏసీల ఏర్పాటుకు బీఎల్ఎస్కు కాంట్రాక్టు..

హైదరాబాద్​, వెలుగు: చైనాలో ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్స్ (ఐవీఏసీలు) ఏర్పాటు, నిర్వహణకు బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్​కు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కాంట్రాక్టు ఇచ్చింది. ఈ విషయాన్ని బీఎల్ఎస్ గురువారం (అక్టోబర్ 16) వెల్లడించింది. ఈ కాంట్రాక్ట్ 2025 అక్టోబర్ 14 నుంచి 3 ఏళ్లపాటు అమలవుతుంది. 

గాల్వన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణల తర్వాత బాగా దెబ్బతిన్న సంబంధాలను మెరుగుపరిచే ప్రయత్నాలలో భాగంగా, చైనా పౌరులకు టూరిస్ట్ వీసాల జారీని తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేంద్రం జులైలో ప్రకటించింది. కరోనా కారణంగా 2020 నుంచి చైనా పౌరులకు టూరిస్ట్ వీసాల జారీని నిలిపివేసింది. తూర్పు లడఖ్ సరిహద్దు వివాదం వల్ల ఆంక్షలు కొనసాగాయి.  బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ బీజింగ్, షాంఘై, గ్వాంగ్‌‌‌‌జౌలలో ఐవీఏసీలను ఏర్పాటు చేస్తుంది.