కాంట్రాక్ట్ వర్కర్సే శవాలను ఖననం చేస్తున్నారు

కాంట్రాక్ట్ వర్కర్సే శవాలను ఖననం చేస్తున్నారు

న్యూయార్క్ : కరోనా విజృంభణతో అమెరికాలోని న్యూయార్క్ లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. మహమ్మరి కారణంగా రోజు వందలాది మంది చనిపోతుండటంతో మృతదేహాలను ఖననం చేసేందుకు సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో టెంపరరీ బేసిస్ లో శవాలను పూడ్చేందుకు కాంట్రాక్ట్ వర్కర్స్ ను నియమించారు. కరోనాతో చనిపోయిన వారిని వారే ఖననం చేస్తున్నారు. బంధువులు లేని వారు, ఖననం చేసేంత స్తోమత లేని హార్ట్ ఐలాండ్ లో పూడ్చేస్తుంటారు. మామూలుగా ఐతే వారానికి 25 శవాలను ఇక్కడ పూడుస్తుంటారు. ఈ పనిని ఖైదీలతో చేయించే వారు. కానీ ఇప్పుడు రోజుకు 25 శవాలను పూడ్చాల్సి వస్తోంది. దీంతో అవసరమైన సిబ్బందిని కాంట్రాక్ట్ బేసిస్ లో నియమించుకున్నారు. కరోనా ఎఫెక్ట్ పోయే వరకు ఖైదీలతో శవాల ఖననం చేయించమని ఓ అధికారి చెప్పారు. కరోనా కారణంగా దాదాపు 18 వేల మంది చనిపోగా న్యూయార్క్, న్యూ జెర్సీలోనే సగం మరణాలు సంభవించాయి.