CSK కొంపముంచిన పవర్ కట్

CSK కొంపముంచిన పవర్ కట్

వాంఖడే స్టేడియంలో కాసేపు పవర్ కట్ అవడం చెన్నైకి చేటు చేసింది. డీఆర్ఎస్ సిస్టమ్ కు పవర్ సరఫరా చేసే మార్గంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో చెన్నై ఇన్నింగ్స్ లో తొలి 10 బంతుల పాటు డీఆర్‌ఎస్‌ అందుబాటులో లేకుండా పోయింది. ఈ కారణంగా  రెండో బాల్​కు కాన్వే, పదో బాల్​కు ఊతప్ప  ఎల్బీలకు రివ్యూ అడుగుదామనుకున్నా డీఆర్‌ఎస్‌ అందుబాటులో లేదని అంపైర్లు చెప్పారు. టాస్ టైమ్​లోనూ  ఓ ఫ్లడ్ లైట్ టవర్​కు కాసేపు కరెంట్ సరఫరా నిలిచిపోయింది.