అభివృద్ధి జరగడం లేదంటూ అధికార పార్టీ కార్పొరేటర్లు ఆరోపణ

అభివృద్ధి జరగడం లేదంటూ అధికార పార్టీ కార్పొరేటర్లు ఆరోపణ

రంగారెడ్డి జిల్లా: బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో మరోసారి వివాదం రాజుకుంది. అక్రమ నిర్మాణాలలో ముందంజలో అభివృద్ధిలో మాత్రం చివరిలో ఆ కార్పొరేషన్ నిలిచింది. తమ ప్రాంతాల్లో అభివృద్ధి జరగడం లేదని  ఆరోపిస్తూ స్వయంగా అధికార పార్టీ కార్పొరేటర్లు మీడియా ముందుకు వచ్చారు. ఒక సంవత్సర కాలంగా ఒకే ఒక సమావేశం నిర్వహించి నిధులను మంజూరు చేయడం లేదంటూ ఆరోపిస్తున్నారు..

అన్న పనులను సైతం కమిషనర్ అనుమతి ఇవ్వడం లేదంటూ ఇదేమని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు తిరుగుతున్నాడని అధికార పార్టీ కార్పొరేటర్లు కమిషనర్ పై ధ్వజమెత్తారు. కార్పొరేటర్లు అందరూ నిలదీయడంతో ఆ ప్రాంత మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి.. దొడ్డి దారి నుంచి వెళ్లిపోయారు. గత 15 రోజుల క్రితం స్వయంగా TRS పార్టీ డిప్యూటీ మేయర్.. కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి మేయర్ పై మహేందర్ గౌడ్ ఆరోపణలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇది మరవకముందే స్వయంగా అధికార పార్టీ కార్పొరేటర్లు ఆరోపించడం మరింత వివాదం ముదురుతోంది.